పాముల‌కు పాలు పోస్తే జైలుకు పంపుతారు

May 14, 2021

హిందువులు పాముల‌ను దైవంగా భావిస్తుంటారు. నాగుల చవితి, నాగుల పంచమి వంటి రోజుల్లో పుట్ట‌ల‌కు పూజ‌లు చేసి పాముల‌కు పాలు పోస్తుంటారు హిందూ మ‌హిళ‌లు. ఇది ఒక‌ ఆచారం. అయితే పాములు పాలు తాగవనేది శాస్త్రీయంగా నిరూపిత‌మైంది. కాబ‌ట్టి, పుట్ట‌ల్లో పాలు పోయ‌డం ద్వారా పాముల చ‌నిపోతున్నందున పాలు పోయొద్ద‌ని జంతు ప్రేమికులు, వ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణ అధికారులు కోరుతున్నారు. తాజాగా, తెలంగాణలో ఈ మేర‌కు క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. భక్తి పేరుతో బలవంతంగా పాముల‌కు పాలు పోయ‌డం వంటివి వన్య ప్రాణులను హింసించడం అవుతుందని, ఇలా చేస్తే కేసులు న‌మోదు చేస్తామని అట‌వీశాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ఎక్క‌డైనా పాముల‌కు పాలు పోస్తున్న‌ట్లు తెలిస్తే త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని కోరుతున్నారు. పాముల‌కు పాలు పోయ‌వ‌ద్ద‌ని మ‌హిళ‌ల‌కు మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *