చిన్నారుల కోసం.. గుహ‌కు డ్రిల్లింగ్

May 15, 2021

గుహలో చిక్కుకున్న యువ ఫుట్‌బాల్ టీమ్‌తో పాటు కోచ్‌ను బయటకు తీసేందుకు సహాయక చర్యలను థాయ్‌లాండ్ ప్రభుత్వం వేగవంతం చేసింది. బాలురు ఉన్న ప్రాంతాన్ని కనుగొనేందు కోసం డ్రిల్లింగ్ యంత్రాలతో 100కు పైగా రంధ్రాలు చేస్తున్నామని రెస్క్యూ టీం హెడ్ తెలిపారు. గుహలన్నీ వరద నీటితో నిండిపోవడంతో వారిని బయటకి తీసుకువచ్చేందుకు ఇబ్బందిగా మారింది. దాదాపు 400మీటర్ల లోతు వరకు రంధ్రాలు చేశాం. అయినా ఇప్పటి వరకు ఇంకా బాలురు ఉన్న కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించలేకపోయాం. వాళ్లు 600 మీటర్ల లోతులో ఉన్నారని అనుకుంటున్నాం. ఇప్పటికైతే కచ్చితమైన టార్గెట్‌ను కనుక్కోలేకపోయాం. అని నరోంగ్‌సాక్ విలేకరులతో పేర్కొన్నారు. ఆక్సిజన్ శాతం తగ్గుతున్న నేపథ్యంలో స్వచ్ఛమైన గాలిని లోపలికి పంపిస్తుమని చెప్పారు. భారీ మోటార్ల సాయంతో అందులోకి చేరిన వర్షపు నీటిని కూడా బయటికి తోడేస్తున్నారు. వారు గుహలో చిక్కుకుపోయి ఇప్పటికే రెండు వారాలు గడిచింది. కావాల్సినంత ఆక్సిజన్ అందకపోవడంతో మాజీ థాయ్ నావీ సీల్ ఉద్యోగి గురువారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈత కొట్టుకుంటూ వారు బయటకు రావాలంటే బాలురకు డైవింగ్ స్కిల్స్ నేర్పించాల్సి ఉంటుంది. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో వారు బయటకు తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *