కారులో మంట‌లు… త‌ప్పిన పెను ప్ర‌మాదం

May 15, 2021

విశాఖ‌ప‌ట్నం జిల్లా పెందుర్తిలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. గోపాలపట్నంలోని కుమారి కళ్యాణ మండపం సమీపంలో గ‌ల‌ పెట్రోల్ బంక్ కూడలి వద్ద కారులో అనూహ్యంగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎయిర్ పోర్ట్ నుండి సింహాచలం వైపు వెళ్తున్న టాటా ఇండిగో కారు మంటలతో పూర్తిగా దగ్ధమైంది. కారులో మంటలు రావ‌డం గ‌మ‌నించిన‌ డ్రైవర్‌… అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో డ్రైవర్ తో పాటు కారులో మ‌రో నలుగురు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *