టీటీడీలో అన్య‌మ‌త‌స్తుడి నియామ‌కం అంటూ త‌ప్పుడు ప్ర‌చారం

May 14, 2021

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం విద్యాశాఖాధికారిగా అన్య‌మ‌త‌స్తుడైన క్రిష్టోఫ‌ర్‌ను నియ‌మిస్తున్నారంటూ పెద్ద ఎత్తున త‌ప్పుడు ప్ర‌చారం ప్రారంభ‌మైంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఓ వార్తా ఛాన‌ల్ వెబ్‌సైట్‌లో ప్ర‌చురిత‌మైన వార్త ఆధారంగా ఈ ప్రచారం జ‌రుగుతోంది. హింధువుల‌కు ఎంతో ప‌విత్ర‌మైన టీటీడీలో అన్య‌మ‌త‌స్తుడిని కీల‌క ప‌ద‌విలో నియ‌మిస్తున్నార‌ని నిజంగానే న‌మ్మిన కొంద‌రు పెద్ద ఎత్తున ఈ వార్త‌ను షేర్ చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాల‌నుకుంటున్న‌ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఈ విష‌యంపై వెంట‌నే స్పందించింది. టీటీడీని జ‌గ‌న్ స్వంత దేవ‌స్థానాలుగా భావిస్తున్నార‌ని బీజేపీ నేత భానుప్ర‌కాష్‌రెడ్డి ఆరోపించారు. అన్య‌మ‌త‌స్తుడిని టీటీడీ డీఈఓగా నియ‌మిస్తే ఊరుకునే ప్ర‌స్త‌కే లేద‌ని పేర్కొన్నారు. అయితే, ఈ విష‌యం తెలుసుకున్న టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి త‌ప్పుడు ప్ర‌చారాల‌ను తీవ్రంగా ఖండించారు. టీడీపీ యెల్లో మీడియాను అడ్డుపెట్టుకొని దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని ఆరోపించారు. త‌ప్పుడు ప్ర‌చారం చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. శ్రీవారి భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తీసి రెచ్చ‌గొట్టేందుకు యెల్లో మీడియా ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. తప్పుడు వార్త ప్ర‌సారం చేసిన వెబ్‌సైట్‌పై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *