అవి నకిలీ సర్టిఫికేట్స్‌ కావు

May 15, 2021

అవి నకిలీ సర్టిఫికేట్స్‌ కాదని తాను పరీక్షల్లో పాసై పొందినవేనని హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ స్పష్టం చేశారు. నకిలీ సర్టిఫికేట్స్‌ సమర్పించారని టీమిండియా మహిళా టీ 20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ను పంజాబ్‌ పోలీస్‌ శాఖ డీజీపీ ఉద్యోగం నుంచి తొలిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంపై తాజాగా హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ స్పందించారు. ఆమె ఈఎస్‌పీన్‌ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడుతూ.. ‘నేను పోస్ట్‌ గ్రా‍డ్జ్యూయేషన్‌లో కూడా అడ్మిషన్‌ తీసుకున్నాను. వీదేశీ పర్యటనల వల్ల ఆ పరీక్షలకు హాజరుకాలేకపోయాను. కానీ నా డిగ్రీ సర్టిఫికేట్‌ను నకిలీవి అంటున్నారు. మీలాగా నేను హెడ్‌ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ.. నా ఎన్‌రోల్‌మెంట్‌ నెంబర్‌తో రుజువు చేయలేను. ఎందుకంటే నేను క్రికెటర్‌. నా దృష్టంతా ఆటపైనే ఉంటుంది. కేవలం డిగ్రీ పూర్తి చేయాలనే చదివాను. నేను అన్ని సబ్జెక్ట్‌లో పాస్‌ అయ్యాను. ప్రతి సర్టిఫికేట్‌ లీగలే. ఢిల్లీలో నేను పరీక్షలు రాశాను. నాసబ్జెక్ట్‌లు సోషియాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, ఇంగ్లీష్‌, జనరల్‌ అవార్‌నెస్‌’ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *