భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన ఫేస్‌బుక్

May 15, 2021

భార్యాభర్తల మధ్య ఫేస్‌బుక్ పెట్టిన చిచ్చు వారి ఆత్మహత్యలకు దారితీసింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఈ ఘటన జరిగింది. రాజమహేంద్రవరం బాంబే కాలనీకి చెందిన బిందు బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన సాయిని ప్రేమికుల రోజు సందర్భంగా పెళ్లి చేసుకుంది. అయితే ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడే కథ మలుపు తిరిగింది.

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన వెంకటేష్‌తో బిందుకు ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. బిందు అమ్మమ్మది కూడా జంగారెడ్డిగూడెం కావడంతో వీరి పరిచయం పెరిగింది. బిందు భర్త సాయికి వెంకటేష్ ఓ రోజు ఫోన్ చేశాడు. బిందును పెళ్లి చేసుకుంటున్నానని అందువల్ల బిందును వదిలేమని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురయిన సాయి గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేష్ తండ్రి కానిస్టేబుల్ కావడంతో పేదవారైన సాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టేందుకు ధైర్యం చేయలేదు. సాయి చనిపోవడానికి వెంకటేషే కారణమని బిందు భావించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెంకటేష్‌కు ఫోన్ చేసింది. వెతుకుంటూ వచ్చిన అతడికి కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జి దగ్గర బిందు కనిపించింది. ఇద్దరు కాసేపు అక్కడ గొడవపడ్డారు. ఆవేశంతో ఆమె బ్రిడ్జిపై నుంచి దూకేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *