దిశ ఎన్ కౌంట‌ర్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

May 15, 2021

సంచ‌ల‌న చిత్రాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రో య‌థార్థ క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ ఎన్ కౌంట‌ర్ నేప‌థ్యంలో ఆయ‌న గ‌తంలో ఓ సినిమా ప్ర‌క‌టించాడు. ఆ సినిమా సంబంధించి శనివారం నాడు సోష‌ల్ మీడియా ద్వారా ఫ‌స్టు లుక్ ను రిలీజ్ చేశారు. దిశ ఘ‌ట‌న‌లో కీల‌క‌మైన లారీని, ఎరుపు రంగు స్కూటీని వ‌ర్మ ఫ‌స్టు లుక్ లో చూపించాడు. పోలీసుల నుంచి త‌ప్పించుకుంటున్న నిందితుల నీడ‌ను అలాగే గురి పెట్టిన ఓ తుపాకీని చూడ‌వ‌చ్చు.

సెఫ్టెంబ‌ర్ 26 న దిశ ఎన్ కౌంట‌ర్ మూవీ టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌నున్నట్లు వ‌ర్మ తెలిపారు. దిశ ఘ‌ట‌న జ‌రిగిన న‌వంబ‌ర్ 26న సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు వ‌ర్మ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ఈ సినిమాకు సంబంధించి వ‌ర్మ నిందితుల కుటుంబ స‌భ్యుల‌ను కూడా క‌లిశారు. సినిమాలో ఏయే అంశాల‌ను వ‌ర్మ చూపిస్తాడ‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *