క్రికెటర్‌ గదిలో అత్యాచారం!

May 15, 2021

శ్రీలంక ఓపెనర్‌ ధనుష్క గుణతిలకాపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు అంతర్జాతీయంగా మ్యాచ్‌లు ఆడకుండా సస్పెన్షన్‌ వేటు వేసింది. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్‌ సందర్భంగా గుణతిలక బస చేసిన హోటల్‌ గదిలో అతడి స్నేహితుడొకరు ఓ నార్వే మహిళపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు రావడమే ఇందుకు కారణం. ఆదివారం గుణతిలక స్నేహితుడు ఇద్దరు నార్వే మహిళల్ని గదికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అందులో ఒక మహిళ తనపై అతను అత్యాచారం జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుణతిలక స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

శ్రీలంక బోర్డు ప్రాథమిక విచారణ అనంతరం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడన్న కారణంతో గుణతికలపై వేటు వేసింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో గుణతిలక చక్కటి ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. దీని ఆధారంగా గుణతిలకాను మళ్లీ జట్టులోకి తీసుకోవడంపై బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమైతే అతని భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *