దేశంలో భారీగా పెరుగుతున్న క‌రోనా కేసులు

May 15, 2021

భార‌త్ లో క‌రోనా ఏమాత్రం త‌గ్గ‌డం కాదు క‌దా… మ‌రింత వేగంగా విస్త‌రిస్తుంది. శ‌నివారం నాటికి 40 ల‌క్ష‌ల 27 వేల పై చిలుకు కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ‌ల్ల దేశంలో 69 వేల 668 మంది చ‌నిపోయారు. అయితే పెరుగుతున్న కేసులు త‌గ్గ‌ట్లే రిక‌వ‌రీ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు 31 ల‌క్ష‌ల 7 వేల 453 మంది రిక‌వ‌రీ అయ్యారు. గ‌డిచిన 13 రోజుల్లోనే 30 ల‌క్ష‌ల నుంచి 40 ల‌క్ష‌ల‌కి చేరుకున్నాం.

ఇక గడిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 86 వేల 432 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. అలాగే దేశ వ్యాప్తంగా 24 గంట‌ల్లో 1089 మంది క‌రోనా వ‌ల్ల మృతి చెందారు. ప్ర‌స్తుతం దేశంలో 8 లక్ష‌ల 46 వేల పైగా ఆక్టివ్ కేసులు ఉన్నాయి. గ‌త మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా 80 వేల పైగా కేసులు న‌మోదవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *