కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఇంట్లో చోరీ

May 15, 2021

మాజీ ఆర్ధిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత పి. చిదంబరం ఇంట్లో చోరీ జరిగింది. 1.1 లక్షల రూపాయల నగదుతో పాటు విలువైన నగలు అపహరణకు గురయ్యాయి. నగరంలోని ఆయన నివాసంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు నుంగంబక్కం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఈ చోరీ గురువారం జరిగినట్లు కంప్లైంట్ పేర్కొన్నారు. కాగా ఆరోజు చిదంబరం చెన్నైలో లేరని సమాచారం.

ఇంట్లో చోరీ జరిగినట్టు చిదంబరం కుటుంబ సభ్యులే ఫార్మల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా చోరీ జరిగిన రెండు రోజుల తర్వాత పోలీసులను సంప్రదించారు. 1.1 లక్షల నగదుతో పాటు విలువైన జ్యూవెలరీ అపహరణకు గురైనట్టు కంప్లైంట్‌లో పేర్కొన్నారు. కాగా ఇద్దరు పనివాళ్లే ఈ పని చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై వారు దర్యాప్తు ప్రారంభించారు. కాగా చిదంబరం కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఉంటున్నారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆయన కొంత కాలంగా ఇంటికి దూరంగానే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *