సామాజిక, రాజ‌కీయ వ్య‌వ‌స్థలో మారాలి- ప‌వ‌న్ క‌ళ్యాణ్

May 15, 2021

సామాజిక‌, రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను మార్చ‌క‌పోతే గుండాలు, ఫ్యాక్ష‌నిస్టులు రాజ్య‌మేలుతార‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. ఏమీ ఆశించ‌నీ స్వార్ధంలేని వ్య‌క్తులే రాజ‌కీయ‌ల్లో ఉండాల‌ని అభిప్రాయ ప‌డ్డారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలోని డీఎన్ఆర్ క‌ళాశాల విద్యార్థులు, స్థానిక జ‌న‌సైనికుల‌తో విడివిడిగా స‌మావేశ‌మ‌య్యారు.
ఈసంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ బ్రోక‌ర్ ప‌ని చేసేవాడు కోట్లు సంపాదిస్తుంటే.. పీజీలు, పీహెచ్‌డీలు చేసిన విద్యావంతులు వారి కింద ప‌నిచేస్తున్నార‌ని… ఇలాంటి వ్య‌వ‌స్థ మారాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 2019 ఎన్నిక‌లు ఏపీకి చాలా కీల‌క‌మన్నారు. 18 సంవ‌త్స‌రాలు నిండిన‌ ప్ర‌తి ఒక్క‌రు ఓట‌రుగా పేరు న‌మోదు చేసుకోవాల‌ని సూచించారు.
ఏపీ మంత్రి నారా లోకేష్‌పై ప‌వ్న మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. లోకేష్‌లా అన్ని అనుకూలంగా ఉన్న స‌మ‌యంలో త‌ను రాజ‌కీయాల్లోకి రాలేద‌ని విమ‌ర్శించారు. అలాగే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పించారు. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌లా తాను బాగా తిట్ట‌గ‌ల‌న‌ని.. త‌న‌కూ పెద్ద నోరు ఉంద‌న్నారు. ఒక‌రినొక‌రు తిట్టుకుంటే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *