వైసీపీపై చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు(వీడియో)

May 15, 2021

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నీటి పంపిణీపై బుధ‌వారం అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎప్పుడూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మండిప‌డే ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు ఇవాళ అసెంబ్లీలో ఆ పార్టీని ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం. రెండు రాష్ట్రాల మ‌ధ్య న‌దీ జ‌లాల అనుసంధానంపై నీటి పారుద‌ల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాద‌వ్ స‌భ‌లో చెప్పారు. ఈ విష‌య‌మై తాము ప్ర‌తిప‌క్షం స‌ల‌హాలు కూడా తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి చెప్పారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్ మాట్లాడారు. త‌ర్వాత ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబు నాయుడు కూడా మాట్లాడి స‌ల‌హాలు చెప్పాల‌ని బుగ్గ‌న ఆహ్వానించారు. దీంతో చంద్రబాబు మాట్లాడుతూ… త‌మ ప‌ట్ల వైసీపీ వాళ్ల‌కు ఇవాళ చాలా అభిమానం ఉన్న‌ట్లుంద‌ని, ఆ అభిమానం చేస్తుంటే త‌న‌కే ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నారు. నిన్నటికి, ఇవాళ‌టికి చాలా మార్పు క‌నిపిస్తోంద‌న్నారు. వైసీపీ వాళ్ల హ‌వ‌భావాలు, మాట‌లు అన్నీ చాలా బాగున్నాయ‌ని అన్నారు. అంద‌రూ మాట్లాడిన త‌ర్వాత తాను మాట్లాడ‌తాన‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *