కోర్కె తీర్చమని వేధింపులు!

May 13, 2021

కోర్కె తీర్చలేదని ఓ యువతిని, ఆమె కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించిన ఓ యువకుడిపై వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. కొండాయపాళెంకు చెందిన ఓ యువతి ఇంటర్మీడియట్‌ చదువుకుని ఇంటి వద్దనే ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు ప్రైవేట్‌ బస్సుడ్రైవర్‌ షేక్‌ హుస్సేన్‌తో పరిచయం అయింది. ఇద్దరు సన్నిహితంగా మెలిగారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను మందలించడంతో ఆమె హుస్సేన్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన హుస్సేన్‌ ఆమెను తనతో మాట్లాడమని, తన కోర్కె తీర్చమని ఫోన్‌ చేసి వేధిస్తున్నాడు
>తాను చెప్పినట్లు వినకపోతే యువతి తమ్ముడిని సైతం చంపుతామని బెదిరించాడు. అయినా ఆమె పట్టించుకోకపోవడంతో వేధింపులను అధికం చేశాడు. ఈ క్రమంలో బాధితురాలి ఇంటి ముందు నిలిపి ఉంచిన బైక్‌ ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున దగ్ధమైంది. దీంతో బాధిత యువతి శనివారం హుస్సేన్‌ వేధింపులపై వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బైక్‌ను సైతం హుస్సేనే దగ్ధం చేసి ఉండటాడని ఫిర్యాదులో పేర్కొంది.  యువతి ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌ ఎస్సై ఐ. మస్తానయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *