బ్రిటన్ యువరాజు కుమారుడి హత్యకు కుట్ర

May 13, 2021

బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్డన్ ముద్దుల కొడుకు ప్రిన్స్ జార్జ్ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెంది రషీద్ అనే ఉగ్రవాది ఈ హత్యకు కుట్ర చేశాడు. దీంతో రషీదును అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తాను బుల్లి యువరాజు జార్జ్‌ హత్యకు కుట్ర చేసినట్టు రషీదు కోర్టులో అంగీకరించాడు. దీంతో అతనికి 25 ఏళ్ల శిక్షను విధించారు. లండన్‌లోని వూల్‌విచ్‌ క్రౌన్‌ కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పును వెలవరించారు. టెలిగ్రామ్‌ ద్వారా ప్రిన్స్ జార్జ్‌ను చంపేందుకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. తన ప్లాన్ విజయవంతం అయితే ఐఎస్ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు సిరియాకు పారిపోవాలనే ప్లాన్ తనకు ఉందని విచారణ సమయంలో రషీద్ కోర్టుకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *