బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. బయటపెట్టిన భార్య

May 13, 2021

ఆర్‌ఎస్‌ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్‌.. ఆయన భార్య మోనికా శర్మ జమ్ము బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శి. గగన్‌ పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల ఓ యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్నారని ఆరోపిస్తూ మోనికా శుక్రవారం ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ‘నా భర్త మంచోడు కాదు. గత కొంతకాలంగా ఓ కాలేజీ యువతితో అఫైర్‌ నడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆ అమ్మాయిని రహస్య వివాహం కూడా చేసుకున్నారు. ఇంతకాలం సాక్ష్యాలు లేక ఆగిపోయా. ఇప్పుడు ఈ ఆధారాలతో(ఫోటోలు) మీ ముందుకు వచ్చా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. మీ బిడ్డకు జరుగుతున్న అన్యాయమనుకుని న్యాయం చేయండి’ అని ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌ షాలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *