సెఫ్టెంబ‌ర్ 6 నుంచి బిగ్ బాస్ 4

May 15, 2021

తెలుగు ప్ర‌జ‌లు ఎంత‌గానో ఎదురుచూస్తున్న‌ ప్ర‌తిష్టాత్మ‌క రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 సెఫ్టెంబ‌ర్ 6 నుంచి స్టార్ మా లో ప్ర‌సారం కానుంది. ఆదివారం సాయంత్రం 6 గంట‌ల నుంచి బిగ్ బాస్ సీజ‌న్ 4 ప్రీమియ‌ర్ షో మొద‌లుకానుంది. అనంత‌రం సోమవారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు రాత్రి 9 గంట‌ల 30 నిమిషాల నుంచి… శ‌ని, ఆది వారాల్లో రాత్రి 9 గంట‌ల‌కు నుంచి బిగ్ బాస్ 4 ప్ర‌సారం కానుంది. లాక్ డౌన్ కార‌ణంగా గ‌త కొన్నినెల‌ల నుంచి  ఎంట‌ర్ టైన్మెంట్ లేక తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు విసిగి పోయారు. ముఖ్యంగా పిల్ల‌లు బిగ్ బాస్ షో కోసం ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. పాఠ‌శాల‌లు లేకపోవ‌డం ఒక‌టైతే, క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇంట్లో నుంచి బ‌య‌టికి రావ‌డానికి పిల్ల‌ల‌కు కుద‌ర‌డం లేదు. దీంతో వారు ఉత్సాహంగా బిగ్ బాస్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్ప‌టికే బిగ్ బాస్ సీజ‌న్ 4కు సంబంధించిన ప్రమోష‌న్స్ ను స్టార్ మా ఛాన‌ల్ మొద‌లుపెట్టింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈసారి చాలా జాగ్ర‌త్త‌ల‌తో షో నిర్వ‌హించ‌డానికి యాజామాన్యం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. ఇప్ప‌టికే షో లో పాల్గొనే కంటెస్టెంట్ ల‌కు క‌రోనా పరీక్ష‌లు నిర్వ‌హించి… నిర్భందంలో ఉంచారు. అయితే కొంత మంది కంటెస్టెంట్ ల‌కు క‌రోనా వైర‌స్ సోకింద‌ని ఊహ‌గానాలు వ‌చ్చాయి. వీటిని షో నిర్వ‌హ‌కులు, కంటెస్టెంట్లు ఖండించారు.

గ‌త సీజ‌న్ల కంటే ఈసారి షోను మ‌రింత విజ‌యవంతం చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు షో నిర్వ‌హ‌కులు. ఎటువంటి అవ‌కాశాలు వ‌దిలిపెట్ట‌కుండా పక్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతున్నారు. బిగ్ బాస్ సీజ‌న్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ తో ఈసారి ఒక స్పెష‌ల్ చాట్ ను నిర్వ‌హ‌కులు ప్లాన్ చేశారు. షో నుంచి ఎలిమినేట్ అయిన వారితో రాహుల్ స్పెష‌ల్ చాట్ చేయ‌నున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక బిగ్ బాస్ సీజ‌న్ 3 హోస్ట్ అక్కినేని నాగార్జునే సీజ‌న్ 4 కూడా హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ప్ర‌స్తుతం నాగార్జున సీజ‌న్ 4 ప్రీమియ‌ర్ షోకు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 3న బిగ్ బాస్ హౌస్ సీక్వెన్స్ సెప్టెంబర్ 5న ప్రీమియర్ షో కోసం నాగార్జున షూట్ చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వ‌హ‌కులు శ‌ర‌వేగంగా చేస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ ల‌ పరిచయ సన్నివేశాలు చిత్రిక‌రించారు.

బిగ్ బాస్ సీజ‌న్ 4 లో మొత్తం 16 మంది కంటెస్టెంట్ లు పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సారి షోను 10 వారాల పాటు నిర్వహించ‌నున్నార‌ని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజ‌న్ 4లోని కంటెస్టెంట్ల‌కు క‌రోనా వైర‌స్ ను దృష్టిలో పెట్టుకుని టాస్కులు ఇవ్వ‌నున్నారు. షేక్ హ్యాండ్స్, కౌగిలింత‌లు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. టాస్కుల కోసం స్పెష‌ల టీం వ‌ర్క్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎలాగైనా షోను స‌క్సెస్ చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో బిగ్ బాస్ 4 నిర్వ‌హ‌కులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *