బంగ్లాదేశ్‌ యువతితో వ్యభిచారం..

May 15, 2021

బంగ్లాదేశ్‌ తదితర దేశాల నుంచి యువతులను హైదరాబాద్‌కు తీసుకువచ్చి వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఒకరిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. గృహ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. హైలంకాలనీకి చెందిన మనోజ్‌కుమార్‌ వ్యభిచార గృహ నిర్వాహకుడు ఇటీవలే బంగ్లాదేశ్‌ నుంచి ఓ యువతిని నగరానికి తీసుకువచ్చాడు. ఆమెతో వ్యభిచారం చేయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసుల డెకాయ్‌ అపరేషన్‌ నిర్వహించారు. ఓ కానిస్టేబుల్‌ కు డబ్బులు ఇచ్చి పంపించగా మనోజ్‌కుమార్‌ పనివాడు వరుణ్‌ వాటిని తీసుకొని వ్యభిచారం చేసేందుకు అనుమతించాడు. అనంతరం పోలీసులు దాడులు నిర్వహించి వరుణ్‌ను అరెస్టు చేశారు. మనోజ్‌కుమార్‌ పరారీలో ఉన్నాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *