ఉన్నావ్‌లో మరో దారుణ ఘటన

May 14, 2021

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ కేసు మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది.  ఓ మహిళపై గుర్తుతెలియని యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముగ్గురు యువకులు మహిళను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయగా., మరో యువకుడు దానిని వీడియో తీశాడు. మాకు సహకరించకపోతే వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తామని బెదిరించారు. గట్టిగా అరిస్తే చెప్పుతో కొడతామన్నారు. అన్నా.. వదిలేయండని అర్థనాధాలు చేస్తూ వేడుకున్నా కామాంధులు కనికరించలేదు. చివరికి ఆ మహిళ ఎలాగోలా ఆ కామాందుల నుంచి తప్పుచుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల​మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై దృష్టిసారించిన పోలీసులు నిందితులకోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *