యాంక‌ర్ ప్ర‌దీప్, యాక్ట‌ర్ కృష్ణుడుకి ఎలాంటి సంబంధం లేదు

May 15, 2021

యాంక‌ర్ ప్ర‌దీప్, యాక్ట‌ర్ కృష్ణుడుతో పాటు త‌న‌ను మ‌రికొంత మంది అత్యాచారం చేశార‌ని ఇటీవ‌లికాలంలో వివిధ యూట్యూబ్ ఛాన‌ల్ల‌కు ఇంట‌ర్వూల ద్వారా తెలియ‌జేసిన యువ‌తి… అస‌లు ఈ కేసుతో వారికి ఎలాంటి సంబంధం లేద‌ని సోమ‌వారం ప్రెస్ క్ల‌బ్ లో జ‌రిగిన ప్రెస్ మీట్ లో యువ‌తి స్ప‌ష్టం చేసింది. తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ పోలీసులకు తప్పుడు స‌మాచారం ఇచ్చాన‌ని తెలియ‌జేసింది.

ఎవ‌రిపై అయితే తప్పుడు కేసులు పెట్టానో వారికి క్షమాపణలు చెబుతున్నానని… ఓ వ్యక్తి ఒత్తిడి మేరకే తాను ఫిర్యాదు చేశానని యువతి చెప్పారు. ఉద్యోగం పేరుతో డాలర్ బాయ్ అలియాస్‌ శ్రీకర్‌రెడ్డి అనే అత‌ను తనను మోసం చేశాడని… చిత్రహింసలకు గురిచేశాడని తెలియ‌జేశారు. అతని సూచన మేరకే కేసు పెట్టినట్టు చెప్పుకొచ్చింది. శ్రీకర్‌రెడ్డి తనపై పలు మార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డ‌డ‌ని… తాను చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానని బెదిరించాడని యువ‌తి వివరించింది. అలాంటి పరిస్థితుల్లోనే కేసు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *