అమెరికా జైలులో డేవిడ్ హెడ్లీపై దాడి

May 15, 2021

ముంబై ఉగ్రదాడుల నిందితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అమెరికా జైలులో శిక్షను అనుభవిస్తున్న అతనిపై ఖైదీలు దాడి చేశారు. దీంతో అతన్ని ఐసీయూలో చేర్పించారు. జూలై 8వ తేదీన డిటెన్షన్ సెంటర్‌లో హెడ్లీపై అటాక్ జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన డేవిడ్ హెడ్లీ.. ఆ దేశానికి చెందిన లష్కరే తోబయిబా ఉగ్రసంస్థతో పనిచేశాడు. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడి కేసులో అమెరికా కోర్టు అతనికి 35 ఏళ్ల జైలు శిక్షను విధించింది. హెడ్లీపై దాడి జరిగిన అంశం గురించి తమకు సమాచారం తెలియదని చికాగో కోర్టు పేర్కొన్నది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ హెడ్లీని ఇవాన్‌స్టన్ హాస్పటల్‌కు తీసుకువెళ్లారు. 2009లో హెడ్లీని అరెస్టు చేశారు. అమెరికా నుంచే ముంబై కోర్టు అతన్ని విచారించింది. ఉగ్రవాది అబూ జుందల్‌ను కలిసినట్లు హెడ్లీ ఆ విచారణలో చెప్పాడు. ముంబైలోని తాజ్ హోటల్‌లో బస చేసిన హెడ్లీ అక్కడ దాడికి సంబంధించి రెకీ గీసినట్లు తెలిసింది. అయితే జైలులో జరిగిన దాడిలో డేవిడ్ హెడ్లీ చనిపోయినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *