చెల్లిని చంపాల‌ని చూస్తోన్న సాక్షి..?

May 15, 2021

చిరంజీవి, నాగార్జున వంటి టాప్ హీరోలతో నటించిన హీరోయిన్ సాక్షి శివానంద్ హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆమెపై ఆరోపణలు చేస్తున్నది ఎవరో కాదు ఆమె సోదరి శిల్పా శివానంద్. ఈమె తెలుగులో మంచు విష్ణు నటించిన ‘విష్ణు’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తరువాత కొన్ని హిందీ సినిమాలు, సీరియల్స్ లో నటిస్తోంది. తన అక్క సాక్షి తన పేరుపై ఉన్న బీమా డబ్బుల కోసం తనను చంపాలని చూస్తోందని, అందుకు సాక్షి అత్త భావన సహాయం చేస్తుందని చెప్పింది. సాక్షి శివానంద్ అత్త భావన ఇప్పటికే భర్తను చంపిన కేసులో పరారీలో ఉందని శిల్పా పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై సాక్షి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *