ప‌ట్టు వ‌ద‌ల‌ని మ‌ద్యం అక్ర‌మర‌వాణ‌‌దారులు

May 15, 2021

తెలంగాణ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు మ‌ద్యాన్ని అక్ర‌మ ర‌వాణ ద్వారా స‌ర‌ఫ‌రా చేస్తున్నవారు ప‌ట్టువ‌ద‌ల‌టం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌ద్యం ధ‌ర‌లు అధికంగా ఉండ‌టంతో తెలంగాణ‌తో పాటు క‌ర్ణాట‌క మ‌రియు ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌ద్యాన్ని అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా చేస్తూ… పోలీసుల‌కు ప‌ట్టుబ‌డుతున్నారు. పోలీసుల‌కు, అధికారుల‌కు దొర‌కుండా ఉండేందుకు చిత్ర‌, విచిత్ర మార్గాల ద్వారా మ‌ద్యాన్ని రవాణ చేస్తున్నారు.

లాక్ డౌన్ అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వం మ‌ద్యం ధ‌ర‌ల‌ను భారీగా పెంచిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి కొంత మంది మ‌ద్యాన్ని అక్ర‌మంగా ఇత‌ర రాష్ట్రాల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు తెప్పించి త‌క్కువ ధ‌ర‌కు అమ్ముతూ… సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని గ‌మ‌నించిన చాలా మంది… మద్యం అక్ర‌మ ర‌వాణ‌కు తెర లేపారు. భారీ స్థాయిలో రోడ్ల‌పై అక్ర‌మ మ‌ద్యం దొరుకుతుండ‌టంతో పోలీసులు, అధికారులు అక్ర‌మ మ‌ద్యంపై దృష్టి పెట్టారు. దీంతో పోలీసుల‌కు భారీ స్థాయిలో తెలంగాణ మ‌ద్యంతో పాటు క‌ర్ణాట‌కకు చెందిన మద్యం ప‌ట్టుబ‌డుతుంది. అయిన స‌రే అక్ర‌మ స‌ర‌ఫ‌రాదారులు మాత్రం ఏ మాత్రం భ‌య‌ప‌డ‌టం లేదు.

10 వేల మ‌ద్యం సీసాలు స్వాధీనం

శనివారం నాడు మంచినీళ్ల ట్యాంక‌ర్ లో స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ దాదాపు 10 వేల మ‌ద్యం సీసాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మునుగోడు మండ‌లం అమ‌రావ‌తిలో ఈ మ‌ద్యం ప‌ట్టుబ‌డింది. స‌త్తెనప‌ల్లి మండ‌లం అబ్బూరుకు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిత్యం పోలీసులు సోదాలు చేస్తుడటంతో ఎక్క‌డో ఓ చోట అక్ర‌మ మ‌ద్యం స‌ర‌ఫ‌రా వెలుగులోకి వ‌స్తుంది. కొన్ని చోట్ల మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాను అడ్డుకోవ‌టంతో పోలీసుల‌తో యువ‌కులు గొడ‌వ‌కు దిగుతున్నారు.

ప‌క్క రాష్ట్రాల నుంచి మూడు బాటిళ్లు తెచ్చుకోవ‌చ్చ‌న్న హైకోర్టు

ఒక్క మద్యం బాటిల్ దొరికిన పోలీసులు వ‌ద‌ల‌క పోవ‌డంతో ఓ వ్య‌క్తి ఏపీ హైకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై తీర్పు వెలువ‌రించిన హైకోర్టు… గ‌తంలో మాదిరిగానే ఒక్కో వ్య‌క్తి ఇత‌ర రాష్ట్రాల నుంచి మూడు మ‌ద్యం బాటిళ్లు తెచ్చుకోవ‌చ్చ‌ని తెలిపింది. జీవో నెంబ‌ర్ 411 అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

మ‌ద్య‌పాన నిషేధం ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వం

ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌ద్యం ఎరులై వ‌స్తుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మాత్రం ఎక్క‌డ త‌గ్గ‌డం లేదు. గ‌తంలో చెప్పిన‌ట్టుగా మ‌ద్య‌పాన నిషేధం ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప‌ని చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే వైన్ షాపుల‌ను ప్ర‌భుత్వమే న‌డిపిస్తుంది. స‌రిహ‌ద్దుల ద‌గ్గ‌ర భారీ స్థాయిలో ఎక్సైస్ పోలీసుల‌ను ప్ర‌భుత్వం మోహ‌రించింది. అందుకే భారీ స్థాయిలో మ‌ద్యం ప‌ట్టుబ‌డుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఇటీవ‌ల మ‌ద్యం ధ‌ర‌లను ప్ర‌భుత్వం త‌గ్గించిన‌ప్ప‌టికీ కేవ‌లం చీప్ లిక్క‌రు పైనే మాత్ర‌మే త‌గ్గించింద‌ని మద్యం ప్రియులు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *