స్వామి పరిపూర్ణనంద ఇంటి వద్ద ఉద్రిక్తత

May 13, 2021

ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన స్వామి పరిపూర్ణానందను పోలీసులు గృహనిర్బంధం చేసిన నేపథ్యంలో హైదరాబాదు జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిందూత్వవాదులు, ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో ఇంటివద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్వామి పరిపూర్ణనంద ఇంటి వద్ద ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పెట్రోల్‌ డబ్బాతో వచ్చిన అతను.. స్వామిజీ మద్దతుగా ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్‌ చేశాడు. అతను ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంటుండగా అడ్డుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *