స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్ల మోసం

May 15, 2021

వరంగల్‌కు చెందిన విద్యార్థికి స్పోర్ట్స్ కోటాలో సీటు ఇప్పిస్తామని తెలంగాణ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కైలాసం యాదవ్ రూ. 4 లక్షల డీల్ కుదిర్చాడు. సీటు కోసం తోట సునీల్ కుమార్ అనే విద్యార్థి కైలాసానికి రూ. 2 లక్షలు చెల్లించాడు. అయితే.. ఇంతలోనే మెడికల్ సీట్ల కుంభకోణం వెలుగులోకి రావడంతో సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వరంగల్‌లోని కైలాసం ఇంటితో సహా నగరంలోని ఎల్బీ స్టేడియంలో జూడో అసోసియేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కైలాసం యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *