స్నేహితుడి కోసం వృద్దుడి ఆత్మహత్య

May 15, 2021

ప్రాణ స్నేహితుడు మృతి చెందాడన్న మనస్తాపంతో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ ఆనంద్‌కుమార్ కథనం ప్రకా రం.. గోల్నాక న్యూ గంగానగర్‌కు చెందిన ఇ.ఆశయ్య(85) కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. కా గా… అదే ప్రాంతానికి చెందిన ప్రాణ స్నేహితుడు వాహిద్ 20 రోజుల క్రితం మృతి చెందాడు. అప్పటినుంచి తీవ్ర మనోవేదన చెందుతున్న ఆశయ్య… ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *