సీఎం కేసీఆర్ కు నిజాం మనవడు లేఖ

May 15, 2021

Nijam grand son Alikhan wrote letter to CM KCR

గౌలిగుడ బస్టాండ్ హ్యాంగర్ కూలిపోయిన ఘటనపై దర్యాప్తు జరపాలని కోరుతూ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మ‌న‌వ‌డు అలీఖాన్ సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. బస్‌ స్టేషన్‌ కూలిపోవడంపై పలు అనూమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై విచారణ జరిపించాలని సిఎంకు ఆయన విజ్ఞప్తి చేశారు. నిజాం ఆస్తులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో అలీఖాన్ పేర్కొన్నారు. నిజాం ఆస్తుల రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇక ఇప్పటికే నిజాం స్మారక చిహ్నాలను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపి అసదుద్దీన్‌ ఒవైసి, సిఎం కెసిఆర్‌ను కోరిన విషయం విదితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *