సీఎం కుమారస్వామితో కేటీఆర్ అల్పాహారం

May 15, 2021

బెంగళూరు పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామిని కలిశారు. ఈ ఉదయం భేటీలో భాగంగా ఇరువురు కలిసి అల్పాహారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న మిషన్ భగీరథ, హరితహారం వంటి ప్రభుత్వ పథకాలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. సీఎం కుమారస్వామి వినయం, సాధారణంగా ఉండే తత్వం తనను ఆకట్టుకున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *