విద్యుత్ షాక్ తో చిన్నారి మృతి

May 15, 2021

యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండల పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వాసాలమర్రి గ్రామంలో 14 నెలల బాలుడు హర్షిత్ కు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో చిన్నారి హర్షిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *