వాకింగ్ సరదా తీసింది చిన్నారి ప్రాణం

May 13, 2021

ప్రమాదవశాత్తు ఐదవ అంతస్తు నుంచి పడి ఓ బాలి క మృతి చెందింది. అల్వాల్ లోని టెంపుల్ అల్వాల్‌కు చెందిన నాగరాజ్, విజయలక్ష్మి దంపతుల కూతురు వర్ష (14) 9వ తరగతి చదువుతున్నది. బాలిక రోజూ ఉదయం వాకింగ్ చేస్తుంది. శనివారం జేజేనగర్‌లోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆదివారం ఉదయం 6గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనంపైకి వాకింగ్ కోసం వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడింది. వెంటనే వాచ్‌మెన్.. స్థానికుల సహాయంతో 108లో గాంధీకి తరలిస్తుండగా మృతిచెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *