వరద ఉధృతికి కొట్టుకపోయిన లారీ

May 15, 2021

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పలిమెల మండలం పంకెన వాగు వద్ద వరద ఉధృతి ఎక్కువైంది. ఈ వాగును లారీ దాటుతున్న సమయంలో వరద ఎక్కువగా ఉండటంతో ఆ వాహనం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికులు అప్రమత్తమై డ్రైవర్‌ను ప్రాణాలతో రక్షించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. రాష్ట్రంలోని పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *