లవర్ తో వీడియోకాల్ మాట్లాడుతూ.. ఆత్మహత్య

May 13, 2021

చదివేది పదకొండో తరగతి.. అప్పుడే ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య జరిగిన స్వల్ప వివాదంతో ఆ విద్యార్థి పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. చివరగా లవర్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని బురాయిపూర్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పదకొండో తరగతి చదువుతున్న యువకుడు.. ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ రాత్రి 12 గంటల సమయంలో తన గదిలోకి వెళ్లి.. లవర్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. దీంతో ఆ యువతి.. తక్షణమే బాధితుడి స్నేహితుడికి జరిగిన విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది. అతను హుటాహుటిన యువకుడి ఇంటికి చేరుకుని బాధితుడి తల్లిని నిద్ర లేపాడు. జరిగిన విషయం చెప్పడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. బాధితుడి రూమ్ తెరిచి చూడగా ఉరేసుకుని కనిపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *