మునగ ఆకు తింటే.. ఆరోగ్యం మీ సొంతం..

May 15, 2021

మున‌గ‌కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. చారులో వీటిని వేసుకుని తిన్నా, కూర‌గా చేసుకు తిన్నా, ఎలా తిన్నా వీటి రుచి వేరేగా ఉంటుంది. అనేక మంది లొట్ట‌లేసుకుంటూ ఈ కాయల‌ను తింటారు. అయితే ఎలా తిన్నా మున‌గ‌కాయ‌ల వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. మున‌గ‌కాయ‌లు మాత్ర‌మే కాక మున‌గ ఆకు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మున‌గ ఆకును రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తింటున్నా లేదంటే మున‌గ ఆకుల‌ను ఎండ‌బెట్టి పొడి చేసి ఆ పొడిని రోజూ తీసుకుంటున్నా దాంతో అనేక అద్భుత ఫ‌లితాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాల‌క‌న్నా 17 రెట్లు ఎక్కువ కాల్షియం మ‌న‌కు మున‌గాకు ద్వారా ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్ల‌ల‌కు మంచిది. దంతాలు దృఢంగా త‌యార‌వుతాయి.

2. మున‌గాకులో ప్రోటీన్లు కూడా ఎక్కువే ఉంటాయి. మాంసం తిన‌నివారు మున‌గ ఆకుల‌తో కూర చేసుకుని తింటే దాంతో శ‌రీరానికి ప్రోటీన్లు బాగా ల‌భిస్తాయి. శ‌రీరానికి పోష‌ణ స‌రిగ్గా అందుతుంది.

3. అర‌టిపండ్ల క‌న్నా 15 రెట్లు అధికంగా పొటాషియం మ‌న‌కు మున‌గాకు ద్వారా అందుతుంది. దీంతో గుండె స‌మ‌స్య‌లు పోగొట్టుకోవ‌చ్చు. ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగుప‌డుతుంది.

4. రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు తీసుకుంటే 13.5శాతం బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తగ్గాయని పరిశోధనల్లో తేలింది. వీటిలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ ద్వారా బ్లడ్‌లో షుగర్‌ లెవల్స్‌ని అదుపులో ఉంచవచ్చు. దీంతో మ‌ధుమేహం ఉన్న వారికి మున‌గాకు చ‌క్క‌ని ఔష‌ధం అని చెప్ప‌వ‌చ్చు.

5. ఐదు రకాల క్యాన్సర్లకు మునగాకు మంచి మందుగా పనిచేస్తుంది. లంగ్‌, లివర్‌, ఒవేరియన్‌, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా వీటికి ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. యాంటీ ట్యూమర్‌గానూ మునగాకు పనిచేస్తుంది.

6. థైరాయిడ్‌ను క్రమబద్ధీకరించే సహజమైన మందు మునగాకు. మునగాకులో ఎ, సి విటమిన్లు, క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌ కూడా అధికంగా ఉంటాయి.

7. మునగాకు రసాన్ని రోజూ తాగితే దృష్టి మాంద్యం, రేచీకటి తగ్గుతాయి. మునగాకులలో అమినో ఆమ్లాలు ఉండడంవల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.

8. గర్భీణులకు, బాలింతలకు మునగాకు రసం ఎంతో మంచిది. వారికి అవసరం అయిన క్యాల్షియం, ఐరన్‌, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు.

9. మునగాకు రసం రక్తహీనతను నివారిస్తుంది. మునగాకు రసాన్ని పాలల్లో క‌లిపి పిల్లలకు అందిస్తే ఎముకలు బలంగా తయారవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *