ముందస్తుకు సిద్ధం: నంద్యాల ఎమ్మెల్యే

May 15, 2021

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ అందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తెలిపారు. గురువారం సాయం త్రం పద్మావతినగర్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం తాము పట్టణంలో 90 శాతం అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. ముఖ్యంగా పట్టణ శివారుల్లోని వైఎస్‌నగర్‌, ఎస్‌ఆర్‌బీసీ, అయ్యలూరు ప్రాంతాలలో నిర్మిస్తున్న ఎన్టీఆర్‌ గృహాలు, సింగల్‌ బెడ్‌ రూం గృహాలను డిసెంబర్‌ నాటికి 6,000 ఇళ్లు పూర్తవుతాయని అన్నారు. ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించామని పేర్కొన్నారు. రోడ్ల పనులలో కొంత జాప్యం జరగడం నిజమేనని, పనులను వేగవంతం చేసేందుకు రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. డ్రైన్‌లను, సీసీ రోడ్లను త్వరగా పూర్తి చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *