మంత్రిని కలవలేదని మహిళా ఐపీఎస్‌పై బదిలీ వేటు

May 14, 2021

ఐపీఎస్ అధికారిణి అయిన జిల్లా ఎస్పీ తనను కలవలేదనే కోపంతో ఆమెపై బదిలీవేటు విధించిన మంత్రి బాగోతం హర్యానా రాష్ట్రంలో వెలుగుచూసింది. హర్యానా రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ గత నెల 30వతేదీన పానిపట్‌ నగరంలో అధికారులతో ఫిర్యాదుల కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రి నిర్వహించిన సమావేశానికి పానిపట్ జిల్లా మహిళా ఎస్పీ సంగీతా కాలియా హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన మంత్రి అనిల్ విజ్ మహిళా ఐపీఎస్ అధికారిణిపై చర్యలు తీసుకోవాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ తాను నిర్వహించిన సమావేశానికి వచ్చి కలవలేదనే కోపంతో మహిళా ఐపీఎస్ అధికారిణి అయిన పానిపట్ ఎస్పీ సంగీతాకాలియాపై బదిలీవేటు వేయించారు. సంగీతాకాలియాను గురుగ్రామ్ బోండ్సీలోని ఫస్ట్ ఇండియా రిజర్వు బెటాలియన్ కమాండెంట్ గా అప్రాధాన్య పోస్టులోకి బదిలీ చేయించారు. 2015 నవంబరులోనూ సంగీతా కాలియా ఫతేబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నపుడు వైద్యశాఖ మంత్రితో జరిగిన సమావేశంలో వాగ్వాదం జరిగింది. అప్పుడు కూడా ఈమెను బదిలీ చేయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *