భార్య కళ్ల ముందే.. చిన్నారిపై అత్యాచార యత్నం..

May 15, 2021

భార్య కళ్ల ముందే భర్త.. ఓ చిన్నారిపై అత్యాచారం చేయబోయాడు. దీంతో భార్య గట్టిగా కేకలు వేయడంతో.. భర్త అటు నుంచి పారిపోయాడు. మధ్యప్రదేశ్ బాలఘాట్ జిల్లా బిర్సా ఏరియాలో శుక్రవారం సాయంత్రం శకు నేతం(25) అనే వ్యక్తి పొరుగింటికి వెళ్లాడు. భర్త వెనుకాలే భార్య కూడా వెళ్లింది. ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఐదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసేందుకు శకు నేతం యత్నించాడు. విషయాన్ని గమనించిన భార్య గట్టిగా కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకునే లోపే నేతం పారిపోయాడు. నేతం ఆచూకీ కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. బాధిత చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోక్సో చట్టం కింద నేతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు శకు నేతంను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *