భారీగా తగ్గిన సోనీ ఫోన్ల ధరలు

May 15, 2021

ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు సోనీ తన ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్‌ఎస్‌, ఎక్స్‌పీరియా ఎల్‌2, ఎక్స్‌పీరియా ఆర్‌1 ఫోన్ల ధరలను తగ్గించింది. ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్‌ఎస్‌ ఫోన్‌ను గత ఏప్రిల్‌ నెలలో రూ.49,990 ధరకు విడుదల చేయగా ఇప్పుడా ఫోన్‌ ధర తగ్గి రూ.29,990కి లభిస్తున్నది. అలాగే ఎక్స్‌పీరియా ఎల్‌2 ఫోన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రూ.19,990కి విడుదల చేయగా ఈ ఫోన్‌ ఇప్పుడు రూ.14,990 ధరకే లభిస్తున్నది. ఇక ఎక్స్‌పీరియా ఆర్‌1 ను గతేడాది అక్టోబర్‌లో సోనీ విడుదల చేసింది. దీని ధర రూ.12,990గా ఉండగా, అది తగ్గి ఇప్పుడు రూ.9,990కే ఈ ఫోన్‌ లభిస్తున్నది. అన్ని సోనీ సెంటర్లు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర ఎలక్ట్రానిక్స్‌ స్టోర్స్‌లోనూ తగ్గింపు ధరలకే ఈ ఫోన్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పలు ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలకు సోనీ ఏమాత్రం పోటీనివ్వలేకపోతున్నది. అందుకనే ఆ కంపెనీ తయారు చేస్తున్న ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోవడం లేదు. దీంతో పాత స్టాక్‌ను క్లియర్‌ చేయాలనే ఉద్దేశ్యంతోనే భారీ తగ్గింపు ధరలకు ఈ ఫోన్లను సోనీ విక్రయిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *