భర్త మర్మాంగాన్ని కొరికి పడేసిన భార్య

May 14, 2021

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. పరాయి వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం భర్త కంటపడింది. ఇద్దరూ రాసలీలల్లో మునిగిపోయిన సమయంలో అడ్డంగా దొరికిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ భర్త.. వారిని ఊరి ముందు నిలబెట్టేందుకు యత్నించాడు. కానీ, అతని నుంచి తప్పించుకునే క్రమంలో ఆ భార్య.. భర్త మర్మాంగాన్ని కొరికిపడేసింది. వెల్లూరులోని గుడియాతం మండలం తురైమూలై గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

భర్తపై దాడి చేసి.. కొరికేసింది..

సెంథామరై(55) అనే రైతు తన భార్య జయంతితో కలిసి ఊళ్లో జరిగిన ఉత్సవానికి హాజరయ్యాడు. ఆ సమయంలో జనసందోహంలో భార్య తప్పిపోగా.. కంగారుపడ్డ సెంథామరై ఆమె కోసం అంతా గాలించాడు. ఆ ప్రాంతానికి కాస్త దూరంలోని ఓ మండపంలో ధచ్ఛనమూర్తి అనే వ్యక్తితో ఆమె అభ్యంతరకర స్థితిలో కనిపించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సెంథామరై వారిని నిలదీశాడు. గ్రామస్థుల కోసం కేక వేయగా.. విషయం తెలిస్తే ఊరంతా చితకబాదుతుందన్నన భయంతో వారిద్దరూ పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆ ముగ్గురి మధ్య పెనుగులాట చోటుచేసుకోగా.. సెంథామరై పంచె ఊడిపోయింది. భయంతో ఏం చేయాలో పాలుపోని జయంతి.. భర్తపై పడి మర్మాంగాన్ని కొరికి పడేసింది. ఆపై ప్రియుడితో అక్కడి నుంచి పరుగు అందుకుంది. ఉత్సవాల వేడుకల హడావుడి ఎక్కువగా ఉండటంతో స్థానికులెవరూ సెంథామరై కేకలను వినలేదు. కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు రక్తపు మడుగులో పడి ఉన్న సెంథామరైను గమనించి ఆస్పత్రికి తరలించారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ధచ్ఛనమూర్తి, జయంతిలను వెల్లూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *