భక్తి ముసుగులో రాసలీలలు.. పట్టుబడ్డ జంటలు

May 13, 2021

జగిత్యాల జిల్లాలో జోరుగా వ్యభిచారం సాగుతుంది. లాడ్జిలు, అద్దె గదులు రాసలీలలకు నిలయంగా మారుతున్నాయి. భక్తులమంటూ కొందరు, కొత్తగా పెళ్లి చేసుకున్నామంటూ మరికొందరు పుణ్య క్షేత్రాల్లోనూ పాపపు పనులకు తెర లేపుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు ప్రముఖ పుణ్య క్షేత్రాలైన కొండగట్టు, ధర్మపురిలాంటి ప్రాంతాల్లో ఇటీవల వ్యభిచారం ఎక్కువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగిత్యాల జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌కు పక్కాగా సమాచారం అందడంతో అసాంఘీక కార్యకలాపాలపై దృష్టి పెట్టినప్పటికీ అసాంఘీక కార్యక్రమాలు ఆగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండగట్టు సమీపంలోని లాడ్జి యాజమానులతో జగిత్యాల డీఎస్పీ భద్రయ్య సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఓ లాడ్జిలో పోలీసులు తనిఖీ చేయగా, రెండు జంటలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.

ధర్మపురిలోని కొందరు ముంబాయి నుంచి యువతులను రప్పించి వ్యభిచార రొంపిలోకి దించుతూ సొమ్ములు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉ న్నాయి. ధర్మపురి, కొండగట్టు ప్రాంతాలు ప ర్యాటక కేంద్రాలుగా ఉండటంతో కొంత మం దికి వరంగా మారింది. ఆయా ప్రాంతాల్లోని రహస్య ప్రాంతాలను ఎన్నుకుని పెద్ద ఎత్తున వ్యభిచారం సాగిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అంతేగాకుండా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లోనిలాడ్జిల్లో కూడా పెద్దఎత్తున వ్యభిచారం సాగుతుంది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన యువతులను తీసుకువచ్చి ముందుగానే విటులకు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు చూపిస్తూ వ్యభిచారం సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జగిత్యాలలో ఇటీవల కొందరు లాడ్జిల్లో పట్టుబడగా, తాజాగా కొండగట్టు లాడ్జిలో రెండు జంటలు దొరకడం జిల్లాలో సాగుతున్న వ్యభిచార గుట్టును రట్టు చేసినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *