బోండేగావ్ జలదిగ్బంధం

May 13, 2021

జిల్లాలోని బైంసాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా బోండేగావ్ గ్రామం జలదిగ్బంధమైంది. ముంపు బాధితులు సమాచారాన్ని మంత్రి హరీశ్‌రావుకు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలిపారు. తక్షణం స్పందించిన మంత్రి ముంపు ప్రాంతాన్ని సందర్శించి బాధితులను ఆదుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్‌కు వెంటనే వాట్సప్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. పునరావాసం శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. ఆహారం, దుస్తులు, ఇతర సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టుల ఇంజినీర్లకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీచేశారు. ప్రాజెక్టులకు సంబంధించిన ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *