బాలుడి ప్రాణం తీసిన స్మార్ట్ ఫోన్

May 14, 2021

స్మార్ట్‌ఫోన్ చిన్నారులు ఆడుకునే ఆట వస్తువుగానే కాకుండా, వారిని ఉన్మాదులుగా మారుస్తుందన్న విషయం మరో సారి రుజువయ్యింది. స్మార్ట్ ఫోన్లలో గేమ్‌లు ఆడుకునే చిన్నారులు పెడదారి కూడా పడుతున్నారనడానికి ఈ సంఘటన సాక్ష్యంగా నిలుస్తున్నది. అసలే మధ్య తరగతి కుటుంబం ఆ పై మదర్సాలలో చదువుకుంటున్న బాలురు స్మార్ట్ ఫోన్ వాడకం ఓ పన్నేండేళ్ల బాలుడి ప్రాణాలను బలిగొంది. స్మార్ట్ ఫోన్లలో శృంగార వీడియోలను చూడటం, స్వలింగ సంపర్కానికి అలవాటు పడటం తో జరిగిన గొడవ లంగర్‌హౌస్‌లో 12 ఏళ్ల బాలుడి హత్య కు దారి తీసింది. లంగర్‌హౌస్‌లో మంగళవారం రాత్రి జరిగిన బాలుడి హత్య కేసును పోలీసులు చేధించారు. చనిపోయిన బాలుడితో స్వలింగ సంపర్కం చేసే 17 ఏళ్ల బాలుడిని నిందితుడిగా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి జువైనల్‌హోంకు రిమాండ్‌ నిమిత్తం తరలించారు.ఈ సంఘటనకు సంబంధించి ఆసిఫ్‌నగర్ ఏసీపీ అశోక చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం … లంగర్‌హౌస్ ఇందిరానగర్‌కు చెందిన అఫ్రోజ్ రెండవ కుమారుడు అస్లం(12) ఎండీలైన్స్‌లో మదర్సాలో చదువుతుండేవాడు. తన ఇంటి సమీపంలో ఉన్న స్నేహితులతో కలిసి స్మార్ట్ ఫోన్లలో శృంగార వీడియోలను చూసేవాడు. అదే బస్తీలో ఉన్న పలువురు బాలురు కూడా స్మార్ట్ ఫోన్లలో శృంగార వీడియోలు చూసి స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో పన్నేండ్ల అస్లంకు పదిరోజుల క్రితం ఇంటి సమీపంలో ఉండే 17 సంవత్సరాల బాలుడితో గొడవ జరిగింది. అస్లం తండ్రి అందరి ముందు కొట్టాడనే కోపంతో 17 ఏళ్ల బాలుడు మంగళవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలోకి అస్లంను బలవంతంగా తీసుకువెళ్లి లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అస్లంపై లైంగిక దాడి చేస్తున్న సమయంలో కూడా సదరు బాలుడు స్మార్ట్ ఫోన్లో శృంగార వీడి యో చూస్తూ చేయడం ఉన్మాదానికి పరాకాష్టగా పేర్కొనవచ్చు. బాలుడిని చంపిన తర్వా త నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అర్ధరాత్రి లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య,ఎస్‌ఐ జగన్‌లు హత్యకు పాల్పడ్డ బాలుడిని అరెస్ట్ చేశారు. జువైనల్‌హోంకు రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు ఏసీపీ తెలిపారు

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *