బాలికపై సీఐ కారు డ్రైవర్‌ అత్యాచారయత్నం

May 14, 2021

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తాజాగా గుంటూరు నగరంలోనే మైనర్‌ బాలికపై సీఐ కారు డ్రైవర్ అత్యాచారయత్నం చేయబోయాడు. ఆ కామాంధుడి చర్యతో బెంబేలెత్తిపోయిన బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో పట్టాభిపురం సీఐ కారు డ్రైవర్ జానీ బాలికను వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనపై బాధిత బాలిక నల్లపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సీఐ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ.. బాధ్యతాయుతంగా మెలగాల్సిన వ్యక్తే.. ఇలా బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *