బాలకపై అత్యాచారం.. గర్భం దాల్చిన చిన్నారి

May 14, 2021

ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం సత్యవోలు గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ గువ్వల పాశ్చామియా (35) అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. మానసిక స్థితి సక్రమంగాలేని ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పలుపర్యాయాలు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపివేస్తానని బెదిరించాడు. బాలిక అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు ప్రైవేటు డాక్టర్‌కు చూపించారు. బాలిక గర్భవతని వైద్యుడు నిర్ధారించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను బెదిరించి పలుపర్యాయాలు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పాశ్చామియాపై ఫోక్టో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.మల్లికార్జున తెలిపారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నటు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *