ఫిల్మ్ రైటర్ ఆత్మహత్య

May 13, 2021

బాలీవుడ్ సినిమా రచయిత 32 ఏళ్ల రవిశంకర్ అలోక్ ముంబైలో బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంధేరీ వెస్ట్‌లోని సెవన్ బంగ్లాస్ ఏరియాలో అతను నివాసం ఉంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అతను అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు. నానా పటేకర్ నటించిన అబ్ తక్ చప్పన్ చిత్రానికి రవిశంకర్ రచయితగా పనిచేశాడు. అతని ఇంట్లో సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. అతను డిప్రెషన్ నుంచి బాధపడుతున్నట్లు పోలీసులు చెప్పారు. మానసిక వైద్యం కూడా తీసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *