ప్రియురాలితో భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

May 14, 2021

ప్రియురాలితో భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య వారిపై దాడి చేసింది. ప్రియురాలి మోజులో పడి తనను, తన పిల్లలను గత కొంతకాలంగా పట్టించుకోవడం లేదంటూ మండిపడింది. ఈ ఘటన భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఇక్కడ భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఏవోగా పనిచేసిన హరిప్రసాద్‌కు నిర్మలతో పెళ్లైంది. ఈమె బొమ్మల రామారం మండలం నాగినేనిపల్లిలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

కలెక్టరేట్‌లో విధులు నిర్వర్తించే మరో మహిళతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడన్న కారణంతో కొద్దికాలం క్రితమే హరిప్రసాద్‌ను విధుల నుంచి తప్పించారు.

గతంలోనూ ఇదే విషయంపై పెద్ద గొడవ జరగడంతో సదరు ఏవోను సెలవుపై పంపించారు.

అయినా పద్ధతి మార్చుకోని హరిప్రసాద్.. తనను, పిల్లల్ని వేధిస్తున్నాడంటూ భార్య నిర్మల ఆరోపించింది. ఓ ఇంట్లో ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను బయటకి ఈడ్చి వెంటాడి తరిమికొట్టింది. అనంతరం పోలీసులకు అప్పగించింది. ప్రియురాలి మోజులో పడి తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్తతోపాటు అతని ప్రియురాలు, కుటుంబసభ్యులో తనను కొట్టారని నిర్మల ఆరోపించారు.

‘హరిప్రసాద్‌కు మయూరి అనే మహళతో శారీరక సంబంధాలున్నాయి. ఈ కారణంగా గత కొంతకాలం నుంచి నాపై, నా పిల్లలపై దాడులకు పాల్పడుతున్నారు. నా కొడుకుకు ఇటీవల యాక్సిడెంట్‌ చేశారు. సంవత్సరం నుంచి గొడవ ముదురుతోంది. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో పనిచేసినప్పుడు నా భర్తకు మయూరితో పరిచయం ఏర్పడింది. అక్రమ సంబంధాలపై హెచ్చరిస్తే.. మా ఇద్దరి మధ్య ఏం సంబంధం లేదని బాండ్‌ పేపర్ల మీద నా భర్త, మయూరి రాసిచ్చారు. అందుకు సంబంధించి వాయిస్‌ రికార్డులు కూడా ఉన్నాయి’ అని నిర్మల తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *