ప్రియుడి మృతిని తట్టుకోలేక.. ప్రియురాలు ఆత్మహత్య

May 15, 2021

ప్రియుడు మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తిరువొత్తియూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నై తిరువొత్తియూరు, గోపినగర్‌కు చెందిన నటరాజన్‌ లారీ ట్రాన్స్‌పోర్టు నడుపుతున్నారు. ఇతని కుమార్తె అశ్విని (20) లా విద్యార్థిని. ఈమె కొన్నేళ్లుగా వేదారణ్యం శెట్టిపురానికి చెందిన తెన్నవన్‌ను ప్రేమిస్తోంది. గత మే 3వ తేదీ నటరాజన్‌ కుటుంబీకులు బంధువుల ఇంటి శుభకార్యంలో పాల్గొనేందుకు కేరళకు వెళ్లారు. వారితో అశ్విని వెళ్లకుండా ఇంట్లో ఒంటరిగా గడిపింది. ఆ సమయంలో తెన్నవన్‌ ఓ రోజు ఇంటికి వచ్చాడు.

ఆ సమయంలో తెన్నవన్‌కు గుండెపోటు రావడంతో మృతిచెందాడు. దీనిపై తిరువొత్తియూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రియుడు మృతిచెందడంతో అశ్విని మనస్తాపం చెందింది. ఈ క్రమంలో తిరువొత్తియూరు శివశక్తినగర్‌లోని పెదనాన్న ఇంట్లో మూడు నెలలుగా అశ్విని ఉంటోంది. శుక్రవారం రాత్రి అశ్విని పెదనాన్న, కుటుంబీకులు బయటికి వెళ్లిన సమయంలో అశ్విని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న సాతాన్‌గాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *