ప్రియుడిని సజీవ దహనం చేసిన ప్రియురాలు

May 15, 2021

శృంగారం చేద్దామని చెప్పి.. ప్రియుడిని మంచానికి కట్టేసి.. ఆ తర్వాత అతడిపై పెట్రోల్ పోసి ప్రియురాలు నిప్పంటించిన సంఘటన ప్రకాశం జిల్లా కొంకలమిట్ల మండలం చౌటపల్లి గ్రామంలో జరిగింది. సంఘటన శనివారం రాత్రి జరిగినప్పటికీ ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. పొదిలికి చెందిన షేక్ షబ్బీర్(32) మర్రిపూడి పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నారు. చౌటపల్లిలో పౌల్ట్రీ ఫాం కూడా నిర్వహిస్తున్నాడు. అయితే షకీరా(28) అనే మహిళతో షబ్బీర్‌కు వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరికి వేర్వేరుగా పెళ్లిళ్లు అయినప్పటికీ వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ క్రమంలో తరుచుగా పౌల్ట్రీ ఫాం వద్ద ఇద్దరూ కలుస్తున్నారు. గత 8 నెలల నుంచి వీరిద్దరి మధ్య ఆర్థిక విభేదాలు చోటు చేసుకున్నాయి.

శృంగారం అంటూ నమ్మించి..

శనివారం రాత్రి పౌల్ట్రీ ఫాం వద్ద షకీరా, షబ్బీర్ కలుసుకున్నారు. కాసేపటి తర్వాత శృంగారం చేద్దామని షబ్బీర్‌కు చెప్పి.. అక్కడున్న ఇనుప మంచానికి గొలుసులతో అతడిని కట్టేసింది ఆ తర్వాత షబ్బీర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించింది. అయితే షబ్బీర్‌ను హత్య చేయాలని ముందే నిర్ణయించుకున్న షకీరా తనతో పెట్రోల్ తీసుకొని వచ్చింది. ఆదివారం ఉదయం పౌల్ట్రీ ఫాం వద్దకు చేరుకున్న వర్కర్లు.. షబ్బీర్ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. షకీరా నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి షబ్బీర్‌ను తానే హత్య చేసినట్లు చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *