పరిశోధనలకు బ్రిటన్ ఆహ్వానం

May 15, 2021

తమ దేశంలో పరిశోధక రంగాన్ని ప్రోత్సహించేందుకు బ్రిటన్ కొత్త వీసాలను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు సహా విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలకు ఘన స్వాగతం పలుకుతున్నది. ఇప్పటికే అమలులో ఉన్న టైర్-5 వీసా విధానానికి అనుబంధంగా యూకేఆర్‌ఐ సైన్స్, రీసెర్చ్, అకడమిక్ స్కీంను శుక్రవారం నుంచి అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) బయటి దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పరిశోధకులు సులభంగా బ్రిటన్‌కు రావడానికి ఈ వీసా అవకాశం కల్పిస్తుంది. పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న బ్రిటన్.. అంతర్జాతీయ పరిశోధకులు ఇక్కడ పనిచేయడంతోపాటు శిక్షణ పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నదని యూకే ఇమ్మిగ్రేషన్ మంత్రి కరోలిన్ నోక్స్ నూతన వీసా పథకం ప్రారంభం సందర్భంగా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *