నేటి నుంచి తానా వేడుకలు

May 15, 2021

నేటి నుంచి (జులై 6) నుంచి మూడు రోజుల పాటు జరగనున్న నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వేడుకల కోసం వేలాది మంది తెలుగు ప్రజలు ఫిలడెల్ఫియా చేరుకున్నారు. దీంతో ఫిలడెల్పియా వీధులన్నీ తెలుగువారితో కళకళలాడుతున్నాయి. వేడుకల కోసం డౌన్‌ టౌన్‌లో నడిబొడ్డున ఉన్న ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్‌ను అంగరంగ వైభంగా ముస్తాబు చేశారు. దీని పక్కనే ఉన్న హోటల్ మారియట్, కోర్ట్ యార్డ్, లోవిస్తో పాటు స్థానికంగా ఉండే తెలుగు వారింట అతిథులు బస చేశారు.

ఈ వేడుకల కోసం వైఎస్సాసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకులు కృష్ణసాగర్, మధుయాష్కీ ప్రదీప్ కుమార్, జంగా రాఘవరెడ్డిలు ఇప్పటికే ఫిలడెల్ఫియా చేరుకున్నారు. వేడుకల్లో భాగంగా తొలి రోజు బాంకెట్ డిన్నర్‌తో వేడుకలు ప్రారంభమౌతాయి. వేర్వేరు రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులను ఈ వేడుకల్లో సత్కరించనున్నారు.

అనంతరం తెలుగు సినీరంగ గాయనీ గాయకుల సారథ్యంలో సంగీత విభావరి జరగనుంది. తర్వాత జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డికి నివాళులు అర్పిస్తారు. తదనంతరం భారత జాతీయ గీతంతో పాటు అమెరికా జాతీయ గీతాలను ఆలపిస్తారు. తరువాత నాటా సావనీర్‌ను ఆవిష్కరిస్తారు. వీటితో పాటు నాటా మొబైల్ యాప్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఈ వేడుకలకు న్యూజెర్సీలో ఉన్న అమెరికా సెనెటర్ థాంసన్ ఆత్మీయ అతిథిగా పాల్గొంటారు. వీరితో పాటు అమెరికా బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటిస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పొల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *