నీట్ పై మద్రాస్‌ హైకోర్టు సంచలన ఆదేశాలు

May 14, 2021

తమిళ విద్యార్థులకు 196 మార్కులు జత చేయాలంటూ మద్రాసు హైకోర్టు కోర్టు ఆదేశించింది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో ఉత్తీర్ణత కాకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. తమిళ భాషలో పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రేస్‌ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మధురై బెంచ్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌సీ)ను ఆదేశించింది.

తమిళ భాష అనువాదంలో తప్పులు..

నీట్‌ పరీక్షా ప్రశ్నాపత్రంలోని తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లాయంటూ సీపీఐ(ఎమ్‌) నేత టీకే రంగరాజన్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. 49 ప్రశ్నలు తప్పుగా అనువాదం చేసినందు వల్ల గందరగోళానికి గురైన విద్యార్థులు మార్కులు కోల్పోయారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మధురై బెంచ్‌ సీబీఎస్‌సీ తీరును తప్పు పట్టింది. నీట్‌ పరీక్షకు సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ పెండింగ్‌లో ఉండగానే ర్యాంకు లిస్టు ఎలా విడుదల చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలతో సుమారు 24 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *