నాలుగేళ్ల చిన్నారి పై అత్యాచార యత్నం

May 15, 2021

ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై ఓ బాలుడు(14) అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మండల కేంద్రంలో కలకలం రేపింది. ఉట్నూర్‌ డీఎస్పీ ఎన్‌.వెంకటేశ్‌ కథనం ప్రకారం.. ఎస్సీ కాలనీకి చెందిన చిన్నారి తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా, అదే కాలనీకి చెందిన బాలుడు(14) బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడన్నారు. భయాందో ళలకు గురైన బాలిక ఏడుస్తుండగా.. ఇరుగు పొరుగు వారితో పాటు బాలిక తండ్రి రావడంతో బాలుడు అక్కడి నుంచి పారిపోయా డని తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో బాలుడిపై నిర్భయ, ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి బాలుడిని అదుపు లోకి తీసుకున్నట్లు ఎస్సై బాలుస్వామి రాము గౌడ్‌ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమి త్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించినట్టు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *